![]() |
![]() |
.webp)
బుల్లితెర మీద స్క్రీన్ మీద కనిపించే ఆన్ స్క్రీన్ ప్రేమలు ఆ స్టేజి దిగాక కనిపించవు అని చాల మంది అంటూ ఉంటారు. అది నిజమైనా కాకపోయినా బుల్లితెర మీద ఆన్ స్క్రీన్ జోడీస్ కొన్ని బాగా హిట్ పెయిర్ గా మంచి పేరు తెచ్చుకున్నాయి. అందులో సుధీర్ - రష్మీ జంట ఒకటైతే వీళ్ళు జస్ట్ స్క్రీన్ వరకే అంటారు. అలాగే రాకేష్ - సుజాతా ..వీళ్లది ఆన్ స్క్రీన్ జోడి కానీ రియల్ లైఫ్ లో మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత ఇమ్మానుయేల్ - వర్ష జోడి...వీళ్ళు మొదట్లో అలరించారు...పెళ్లి విషయాలు మాట్లాడుకున్నారు కానీ ఇప్పుడు వేరే వేరే షోస్ లో చేస్తున్నారు. అలాగే ప్రియాంక జైన్ - శివ్ వీళ్ళ గురించి చెప్పక్కర్లేదు. వీళ్ళు పెళ్లి చేసుకుంటాం అని చెప్తూనే ఉన్నారు.
కానీ చేసుకోవడం లేదు. చేసుకుంటారా లేదా ఇదంతా రేటింగ్ కోసమా అనే డౌట్ కూడా చాలా మందిలో ఉంది. ఇదే విషయాన్ని ఆది కూడా వాళ్ళను అడిగాడు. నెక్స్ట్ వీక్ శ్రీదేవి డ్రామా కంపెనీ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో ఆది అదే ప్రశ్న అడిగాడు. "జెన్యూన్ గా ఒక డౌట్ ఉంది. ఈ రేటింగ్స్ కోసం రిలేషన్ షిప్ పెట్టుకోవడం మీరు కూడా ఇలా ఈ టీవీ షో కోసం ఇలా చేస్తున్నారా ? " అని అడిగాడు. దాంతో ప్రియాంక జైన్ కి కోపం వచ్చేసి శివ్ ని చూసింది. "ఇది రియల్లీ టూ మచ్. "మీరు నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా" అని మళ్ళీ అడిగాడు ఆది. దాంతో శివ్ కి కోపం నషాళానికి అంటింది. "మీ డౌట్ నేను క్లియర్ చేస్తాను. పరి మనం ఈ స్టేజి మీదనే పెళ్లి చేసేసుకుందాం" అన్నాడు సీరియస్ గా శివ్. అన్నట్టుగానే స్టేజి మీదనుంచి వెళ్లి తాళి తీసుకొచ్చి పరి మెళ్ళో కట్టేసాడు. దాంతో ఇంద్రజ షాకయ్యింది. మిగతావాళ్ళు కూడా అలానే చూస్తూ ఉండిపోయారు. మరి ఇది నిజంగా పెళ్లా రేటింగ్ కోసం ఇదేమన్నా ప్రాంకా చూడాలి.
![]() |
![]() |